ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి హుజూర్ నగర్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్ కు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డిలు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత హుజూర్ నగర్ లో నూతనంగా నిర్మించిన మున్సిపాలిటీ భవనంతో పాటు ఈఎస్‌ఐ ఆస్పత్రిని, ఎస్టీవో కార్యాలయం, బస్తీ దవాఖానా, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
దీంతో పాటు కేతవారిగూడెం నుంచి మునుగాలకు నిర్మించే రోడ్డు, నేరేడు చర్ల మున్సిపాలిటీలో అభివృద్ధిపనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హుజూర్‌నగర్‌లో జరిగే భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ చండూరులో పర్యటించనున్నారు. చండూరు మున్సిపాలిటీలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత గట్టుప్పల్ మండలంలో నిర్మించనున్న చేనేత క్లస్టర్లకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి