‘ధమాకా’ 100 కోట్ల పాఠం

22
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టింది. రిలీజైన రెండు వారాల్లో 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం ద్వారా ఇండస్ట్రీ కి సరికొత్త పాఠం నేర్పింది. కథ రొటీన్ అయినప్పటికీ ధమాకా కి ప్రసన్న ఇచ్చిన ట్రీట్ మెంట్ ప్రేక్షకులను మెప్పించి అలరించింది.

నాన్ థియేట్రికల్ బిజినెస్ లోనే పూర్తి పెట్టుబడిని రికవరీ చేసింది ధమాకా. థియేట్రికల్ బిజినెస్ ద్వారా సినిమా ఎంత వసూలు చేస్తున్నా అది నిర్మాతలకు అదనపు ఆదాయమే అని చెప్పాలి. 100 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీ లాభాలను అందిస్తూ ఇండస్ట్రీకి షాక్ ఇస్తుంది. తొలి రోజు మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా డే వన్ నుండే భారీ కలెక్షన్స్ రాబట్టింది. సినిమా బాగుంటే రివ్యూలు , రేటింగ్ పట్టించుకోకుండా సినిమా చూస్తారని ధమాకా మరోసారి నిరూపించింది.

మాస్‌, యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో పాటు, సినిమాలో తగిన వినోదం ఉంటే కమర్షియల్ సినిమాలకు ఎప్పుడూ డోకా ఉండదని ధమాకా ఇండస్ట్రీకి మళ్ళీ కమర్షియల్ పాఠం నేర్పింది. విజువల్ ఎఫెక్ట్ తో ఐ ఫీస్ట్ ఇచ్చే సినిమాలకే ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారనే ప్రచారానికి కూడా ధమాకా చెక్ పెట్టి కమర్షియల్ సినిమాలకు మాస్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారని రుజువు చేసింది. ఏమైనా రవితేజ ధమాకా తో వంద కోట్ల విలువైన పాఠం నేర్పించింది.

ఇవి కూడా చదవండి…

ఆ హిందీ దర్శకుడితో చరణ్

సుమ షోలో చిరంజీవి సందడి?

మంచులక్ష్మిని బయపెట్టిన అనుష్క

- Advertisement -