మంచినీటి నాణ్యత విషయంలో రాజీపడొద్దు..

227
- Advertisement -

విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్‌లో దేశంలో ఏ నగరంలో లేని విధంగా నాణ్యమైన మంచినీటితో నగరవాసుల దాహార్తిని తీర్చుతున్నట్లు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి. కె. తారక రామారావు గారు తెలిపారు. గురువారం రోజున బుద్దభవన్‌లో జలమండలి ఉన్నతాధికారులతో బోర్డు రెవెన్యూ పెంపు, ఎన్ఆర్ డబ్ల్యూ తగ్గింపు, సెవరెజీ మాస్టర్ ప్లాన్, మంచినీటి సరఫరాపై రాష్ట్ర ఎంఏయూడీ కమీషనర్ అర్వింద్ కుమార్, ఐఏఎస్, జలమండలి ఎండీ ఎం. దానకిషోర్, ఐఏఎస్ లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఏ మహానగరంలో లేని విధంగా విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న హైదరాబాద్‌లో నాణ్యమైన మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నీటి లభ్యత విషయంలో ఇతర నగరాలతో పోల్చుకుంటే సుదూరంలో ఉన్న కృష్ణా, గోదావరి నదులతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ల నుంచి నీటిని తీసుకువచ్చి శుద్ది చేసి ఓఆర్ఆర్ వరకు నగర నలుమూలాల ప్రజలకు అందిస్తున్నట్లు వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కొండపోచమ్మ రిజర్వాయర్, కేశవాపూర్ రిజర్వాయర్ పూర్తి అయితే నగరానికి ఇక మంచినీటికి ఢోకా ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటీకే రింగ్ మెయిన్ తో ఎక్కడ నీటి లభ్యత ఉన్న నగరంలోని ప్రతి ప్రాంతానికైనా మంచినీటి సరఫరా చేయడానికి నిర్మించిన రింగ్ మెయిన్ తో పాటు రూ. 280 కోట్లతో మరో రింగ్ మెయిన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

ktr 2

దీంతో ఏ కాలమైనా నీటి కొరతలేని మహానగరంగా హైదరాబాద్ రూపొందుతుందని అభిప్రాయపడ్డారు. జలమండలి ఆదాయం పెంచుకుని ఆర్ధికంగా బలోపేతం అవడానికి నూతన సంస్కరణలను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం జలమండలి చేపట్టిన వాణిజ్య కనెక్షన్ల గుర్తింపు, ఇంటింటి సర్వేలు సత్ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి అభినంధించారు. అవసమయితే మరిన్ని ఇంటింటి సర్వే బృందాలను ఏర్పాటుచేసి నగరంలోని ప్రతి ఇంటిని సర్వే చేయాలని సూచించారు.

జలమండలి ప్రవేశపెట్టిన విడిఎస్-2019 పధకం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటీకీ ఎన్ని దరఖాస్తులు వచ్చాయి. ఎంత ఆదాయం సమకూరింది, ఇంకా ఎన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నదనే విషయాలను మంత్రి తెలుసుకున్నారు. విడిఎస్ -2019ను పకడ్బందీగా అమలు చేసి 2020 మార్చి చివరినాటికి ఆదాయం పెంచుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

భోలక్ పూర్ లాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా కలుషిత నీరు సరఫరా సంబంధించిన ఫిర్యాదులు తగ్గుముఖం పట్టే దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంచినీటి నాణ్యత విషఁయంలో ఎక్కడ రాజీపడోద్దని వివరించారు. దేశంలోనే జలమండలి పరిధిలో సమర్ధవంతమైన క్వాలిటీ కంట్రోల్ విభాగం ప్రతిరోజు 3వేలకు పైగా మంచినీటి నమూనాలను సేకరించి పరీక్షలు చేసి నమోదు చేసి పెడుతుందని మంత్రి వివరించారు. సిల్ట్ ఛాంబర్ నిర్మించుకునేలా నగరవాసుల్లో అవగాహాన కల్పించేందుకు అవసరమయితే ఎన్జీవోలు, స్వయం సహాయక బృందాల సాయంతో విస్తృత ప్రచారం చేపట్టాలని మంత్రి తెలిపారు.

మంచినీటి పైపులైను, సెవరెజీ పైపులైనుల జీఐఎస్ అనుసంధానం త్వరగా పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 2020 మార్చి చివరి నాటికి రెవెన్యూ డాకెట్ ప్రక్రియ పూర్తిచేయాలని మంత్రి సూచించారు. డాకెట్ వారీగా మంచినీటి సరఫరా, బిల్లింగ్, కలెక్షన్ వివరాలతో పాటు ఎన్ఆర్ డబ్య్లూ తగ్గించిన శాతం సంబంధించిన గణాంకాలు సైతం డాకెట్ వారీగా అందుబాటులో ఉంచాలని తెలిపారు.
ఓఆర్ఆర్ వరకు సెవరెజీ వ్యవస్థను జీహెచ్ఎంసీ నుంచి జలమండలికి అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. 3నెలలు జలమండలి, జీహెచ్ఎంసీ సిబ్బంది సంయుక్తంగా సెవరెజీ నిర్వహణ పనులు చేపట్టాలని సూచించారు. అప్పగింత ప్రక్రియ పూర్తయిన వెంటనే మార్చి31, 2020 తరువాత సెవరెజీ నిర్వహణ జలమండలి చేపడుతుందని వివరించారు.ఓఆర్ఆర్ లోపల నూతనంగా చేపట్టే ఎఫ్ఎస్టీపీలు, ఎస్టీపీల డీపీఆర్ పురోగతిపై ఈ సందర్భంగా మంత్రి సమీక్షించారు.

ktr 1

ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. ఇంటింటి సర్వేలో ఇప్పటి వరకుయ ఆరు డివిజన్ల పరిధిలో 62,123 కనెక్షన్లను సర్వే చేయగా ఇందులో 3202 కమర్షియల్ కనెక్షన్లు, 1177 ఎంఎస్ బీ కనెక్షన్లు, 1227 అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఒకేసారి కనెక్షన్ ఛార్జీల రూపంలో దాదాపుగా రూ. 7కోట్లు, నెలనెల నల్లా బిల్లు ద్వారా దాదాపు రూ. 21 లక్షల ఆదాయం సమకూరుతుందని మంత్రికి తెలిపారు.

అంతేకాకుండా సనత్ నగర్ లో ప్రవేశపెట్టిన పైలెట్ ప్రాజెక్టుపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న ఇంటింటి సర్వే, ఎమ్మార్ మీటర్ల తనిఖీలు, క్యాన్ నెంబర్లకు భవన ఫోటోల అనుసంధానం పురోగతిపై సమీక్షించారు. ఈ ప్రక్రియ సనత్ నగర్ లో విజయవంతమయితే రానున్న రోజుల్లో ఓఆర్ఆర్ వరకు నగరమంతా భవన ఫోటోల అనుసంధానం ప్రక్రియ చేపడుతామని తెలిపారు.

అనంతరం అక్రమ నల్లా కనెక్షన్లను క్రమబద్దీకరించుకునేందుకు ప్రవేశపెట్టిన విడిఎస్-2019 పోస్టర్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎం. సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్లు ఎం. ఎల్లాస్వామి, డి. శ్రీధర్ బాబు, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి. రవి, ఫైనాన్స్ డైరెక్టర్ వాసుదేవనాయుడు, టెక్నికల్ డైరెక్టర్ వి.ఎల్. ప్రవీణ్ కుమార్ లతో పాటు సీజీఎమ్ లు పాల్గొన్నారు.

- Advertisement -