- Advertisement -
భవన నిర్మాణ వ్యర్థాలను తరలించే ఆధునిక కంప్యాక్టర్ వాహనాలను ప్రారంభించారు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు వద్ద మంత్రి కేటీఆర్ జెండా ఊపి స్వచ్ఛ వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
కంప్యాక్టర్ వాహనాల ద్వారా భవన నిర్మాణాల వ్యర్థాలను తరలించనున్నారు. 50 వాహనాలను ఏర్పాటు చేయగా ఒక్కో వాహన సామర్థ్యం 20 క్యూబిక్ మీటర్లు కాగా, అందులో 15 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించవచ్చు.
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం వ్యర్థాలను పూర్తిగా కప్పి ఉన్న వాహనంలోనే తరలించాలి. ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల వద్ద సైతం చెత్త కనిపించకుండా తగిన ఏర్పాట్లు చేయాలి.
- Advertisement -