21 అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

148
ktr

పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు తన జన్మదినం సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా అంబులెన్సుల ప్రారంభోత్సవం కొనసాగుతోంది. ఈ రోజు మరో 21 అంబులెన్సులను వివిధ నియోజకవర్గాలకు సేవలందించేందుకు పంపించడం జరిగింది. ఇందుకు సంబంధించిన అంబులెన్స్లో ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రగతి భవన్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్-3, మల్లారెడ్డి-3, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి-3, మహబూబ్నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి -3, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి-1 ఆధ్వర్యంలో అందించిన అంబులెన్సులను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు.

ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి -2, నన్నపనేని నరేందర్, ఉపేందర్రెడ్డి, ఆరూరి రమేష్, ఛీఫ్ విప్ వినయ్ భాస్కర్,  వరంగల్కు చెందిన లక్ష్మణరావు, మహబూబ్ నగర్ కు చెందిన మంత్రి నిరంజన్ రెడ్డి లు ఒక్కో అంబులెన్సులను అందించారు. మహబూబ్ నగర్, హైదరాబాద్ కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సేవలు అందించేందుకు ఈ అంబులెన్సులను వినియోగించనున్నారు.