కొంతకాలంగా బీజేపీ నేతలు టీఆర్ఎస్‌ను తిట్టిపోస్తూనే ఉన్నారు. అవినీతి చేశారంటూ నేరుగా సీఎం కుటుంబ సభ్యుల పేర్లు కామెంట్ చేస్తున్నారు. ఆరోపణలు మరీ ఎక్కువైతే టీఆర్ఎస్ పార్టీ నుండి ఇతర నేతలు ప్రెస్ మీట్లు పెట్టి ఖండించారు తప్పా కేటీఆర్ రంగంలోకి దిగలేదు. కానీ కొంతకాలంగా కేటీఆర్ అటాకింగ్ చూసి బీజేపీ నేతలు సైతం అవాక్కైతున్నారు. జాతీయ నేతలు వచ్చి మాట్లాడి… టీఆర్ఎస్ ను, కేటీఆర్ ను విమర్శిస్తేనే కేటీఆర్ లేదా కేసీఆర్ మీడియా ముందు అసలు విషయం ఏంటో చెప్పి బీజేపీ నేతల నోర్లు మూయించే వారు. కానీ, కొన్ని రోజులుగా బీజేపీ నేతల విమర్శలు శృతి మించటంతో కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. మీ కన్నా నేను ఓ మెట్టు ఎక్కువే చదివా అన్న రీతిలో మాటకు మాట జవాబిస్తున్నారు. అంతకు ముందు కేటీఆర్ అవినీతిపై బండి సంజయ్ ఎన్నో ఆరోపణలు చేసినా… పుల్ స్టాప్ పెట్టాల్సిందేనన్న ఉద్దేశంతో కేటీఆర్ బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపారు.
దీంతో బండి సంజయ్ ఆ విషయంలో కనీసం నోరు కూడా ఎత్తటం లేదు సరికదా కేటీఆర్ అవినీతి అంటూ నేరుగా మాట్లాడటమే మానేశారు. అంతేకాదు కేటీఆర్ డైరెక్టుగా లేదా సోషల్ మీడియా ద్వారా బీజేపీని, మోడీ- అమిత్ షాల తీరును ఎండగడుతూనే ఉన్నారు. దేశానికే రోల్ మోడల్ గుజరాత్ అన్న ప్రచారం ఉండగా… బీజేపీ నేతల గొప్పలు తప్పా అక్కడ అభివృద్దే లేదని ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు ఎవరైనా కేంద్రమంత్రులు రాష్ట్రానికి వస్తే వారి శాఖ నుండి కేంద్రంలో పెండింగ్ లో ఉన్న అంశాలను ప్రస్తావిస్తున్నారు. మొన్న అమిత్ షా టూర్ లోనూ ఇదే జరిగింది. అంతకు ముందు సైలెంట్ గా ఉన్న కేటీఆర్ ఒక్కసారిగా అటాకింగ్ మోడ్ లోకి రావటంతో బీజేపీ నేతలు సైతం విస్తుపోతున్నారు. కేసీఆర్ అంటే వేరు కేటీఆర్ కూడా ఇంత డేర్ గా రివర్స్ అటాక్ చేస్తున్నారంటే టీఆర్ఎస్ వ్యూహాం పెద్దగానే ఉంటుందని, ఇది కేంద్ర స్థాయి నేతల వ్యవహరం కావొచ్చని బీజేపీ క్యాడర్ కూడా ఆలోచనలో పడింది.