వెంకటేష్‌కు చెల్లిగా పూజా హెగ్డే..!

77
venkatesh
- Advertisement -

టాలీవుడ్‌ బ్యూటీ పూజా హెగ్డే వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. తెలుగు, తమిళం, హిందీలో పలు చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌తో ‘కభీ ఈద్‌ కభీ దివాళి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ‌ర్హ‌ద్ సామ్‌జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ షరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు.

ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్ డేట్ ఆసక్తిరేపుతోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ పూజా హెగ్డే అన్నా చెల్లెళ్లుగా కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో వీరిద్దరి మధ్య వున్న అనుబంధం.. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. పూజా హెగ్డే ఇటీవలే ఈ మూవీ షూటింగ్ లోకి ఎంటరైంది. విక్టరీ వెంకటేష్ వచ్చే నెల నుంచి ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని డిసెంబర్ 30న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్‌.

- Advertisement -