కీసరలో కేటీఆర్ ఫ్యామిలీ ప్రత్యేకపూజలు..

87
ktr
- Advertisement -

మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు భ‌క్తులు పోటెత్తారు. శివనామస్మరణ, హ‌ర‌హ‌ర మ‌హాదేవ శంభోశంక‌రా అంటూ భక్తులు ఆలయాలకు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఇక శివరాత్రి సందర్భంగా ప్రముఖ ఆలయం కీసర గుట్ట శ్రీ రామ‌లింగేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో ప్రత్యేక పూజలు నిర్వహంచారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ భార్య శైలిమ‌, కుమారుడు హిమాన్షు. ఈ పూజా కార్య‌క్ర‌మంలో మంత్రి మ‌ల్లారెడ్డి కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు.

ఆల‌యానికి చేరుకున్న కేటీఆర్ కుటుంబ స‌భ్యుల‌కు, మంత్రి మ‌ల్లారెడ్డికి అర్చ‌కులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేసి ఆశీర్వ‌చ‌నం అందించారు.

- Advertisement -