భారీ రేటుకు కమల్ విక్రమ్!

115
vikram
- Advertisement -

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం విక్రమ్‌. ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తుండగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏర్పిల్ 28న విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. సినిమాకు సంబంధించిన శాటిలైట్, డిజిలైట్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం డిస్నీ+హాట్ స్టార్ దాదాపు రూ.115కోట్లు చెల్లించి కోనుగోలు చేసిందని సమాచారం.

దీంతో సినిమా విడుదలకు ముందే భారీ లాభాలను అర్జించారు కమల్. ఈ మూవీని తన సొంత బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మిస్తుండగా భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రంతో విశ్వనటుడు ఏ మేరకు ఆకట్టుకుంటాడో వేచిచూడాలి…

- Advertisement -