మొక్కలను నాటిన పోలీస్ అధికారులు

210
green
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ముమ్మరంగా మొక్కలను నాటి పర్యవరణ పరిరక్షణ కోసం రాష్ట్రంలోని ప్రముఖ వ్యక్తులతో ఉద్యమంగా కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమములో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఐజీ ప్రమోద్ కుమార్ చేసిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ ఇంచార్జ్ పుష్పా మరియు ఆర్మూడ్ రిజర్వ్ విభాగం అదనపు డి.సి.పి భీంరావు లు వారి వారి కార్యాలయము ఆవరణలో మొక్కలను నాటి వాటి సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకున్నారు.

అనంతరం వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా, వరంగల్ ఎసిపి ప్రతాప్, హన్మకొండ ఏ.సి.పి జితేందర్, కాజీపేట ఎ.సి.పి రవీంద్రకుమార్ లను గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరగా, అదనపు డి.సి.పి భీంరావు ఆర్మూడ్ రిజర్వ్ అదనపు డి.సి.పి గిరిరాజు, రిజర్వ్ ఇన్స్‌పెక్టర్లు భాస్కర్, శ్రీనివాస రావులకు గ్రీన్ ఛాలెంజ్ చేశారు. ఈ సందర్భంగా ఇరువురు అధికారులు మాట్లాడుతూ హారతాహరం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అమలు చేయడం జరుగుతోంది.

ఇందులో భాగం రాజ్యసభ సభ్యులు యం.పీ సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా రానున్న రోజుల్లో భవిష్యత్తు తరాలవారికి కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడంతో పాటు, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రత్యక్ష భాగస్వామలవుదామని పోలీస్ అధికారులు పిలుపునిచ్చారు.

- Advertisement -