- Advertisement -
మంత్రి హరీష్ రావుకు కంగ్రాట్స్ చెప్పారు ఐటీ శాఖమంత్రి కేటీఆర్. ఎన్నికల సందర్భంగా బంజారాహిల్స్ లో ఓటెసిన కేటీఆర్ అనంతంరం సొంత నియోజకవర్గం సిరిసిల్లకు బయల్దేరారు. సిద్దిపేటలో ఓటు వేసిన అనంతరం మంత్రి హరీష్ రావు పలు నియోజకవర్గాలు తిరుగుతూ పరిస్ధితిని తెలుసుకుంటున్నారు.
ఈసందర్భంగా గుర్రాల గొంది గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న కేటీఆర్, హరీశ్ తమ వాహనాలను ఆపి పలకరించుకున్నారు. మంత్రి కేటీఆర్ హారిష్ రావు దగ్గరకు వచ్చి అప్యాయంగా బావ నీకు లక్ష మెజారీటి వస్తుందని ముందుగానే కంగ్రాట్స్ చెప్పారు. నీదాంట్లో సగం మెజార్టీ అయినా తెచ్చుకుంటా అన్నారు. దీంతో ఇద్దరు కాసేపు ఎన్నికల పోలింగ్ గురించి మాట్లాడుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ఉత్సాహంగా జరుగుతోందని ఆనందo వ్యక్తం చేశారు.
- Advertisement -