ఈ ఫోటోలో కేటీఆర్‌ ఎక్కడ ఉన్నారు గుర్తించండి..!

205
KTR
- Advertisement -

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సోషల్ మీడియాలో సేవా కార్యక్రమాల గురించే కాక.. అప్పుడప్పుడు తన పర్సనల్ లైఫ్ ను కూడా ఎక్స్ ప్లోర్ చేస్తుంటారు. తన మెమోరబుల్ మూమెంట్స్ ను కూడా అప్పుడప్పుడు కేటీఆర్ షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. అది తన చిన్ననాటి ఫోటో..చిన్నప్పుడు తన క్లాస్ మెట్స్ తో కలిసి దిగిన ఫోటో.

తన పాఠశాలలో ఉన్నప్పటి ఫొటోను జర్నలిస్టు క్రిష్‌రాజ్‌మురారి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ ‘కేటీఆర్‌ మీకు జ్ఞాపకం ఉందా? ఎన్‌పీఎస్‌ (నలంద పబ్లిక్‌ స్కూల్‌) 1988 బ్యాచ్‌.. ఈ ఫొటోలో ఎవరైనా ఫ్యూచర్‌ లీడర్‌ను గుర్తించగలరా? కేటీఆర్‌ ఎక్కడ ఉన్నారు గుర్తించండి’అని కామెంట్‌ పెట్టారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌ ‘ఈ చిత్రానికి ధన్యవాదాలు. నలంద పబ్లిక్‌ స్కూల్‌లో నా హాస్టల్‌ రోజులను ఈ ఫొటో గుర్తు చేసింది’ అని రిైప్లె ఇచ్చారు. నెటిజన్లు ఆ ఫొటోలో కేటీఆర్‌ను గుర్తించే ప్రయత్నం చేశారు.

బాల్యంలో బడికి వెళ్లిన జ్ఞాపకాలు. ఇంటర్వెల్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి గడిపిన మధుర క్షణాలు కేటీఆర్‌ మదిలో పది కాలాలపాటు పదిలంగా ఉన్నాయి. అప్పుడప్పుడూ మనసుని మురిపిస్తుంటాయి. ఆ చిన్ననాటి తీపి జ్ఞాపకం కేటీఆర్‌ మనసుని బాల్యానికి తీసుకెళ్లింది. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తే మనసుకి పట్టలేని ఆనందం. మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లాలనిపిస్తుంది. అప్పటి ఆటలు ఆడాలనిపిస్తుంది అప్పటిలా స్నేహితులతో తినాలనిపిస్తుంది. అలాంటి మధురానుభవమే కేటీఆర్‌కి ఎదురైంది.

- Advertisement -