తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, హో మంత్రి నాయిని నరసింహరెడ్డి, డిప్యూటి సీఎం మహ్మద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు పలువురు నేతలు, టీఆర్ఎస్ కార్యకర్తలు బర్త్ డే వేడుకల్లో పాల్గోన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం రోడ్డుకు ఇరువైపులా మంత్రులు మొక్కలు నాటారు. టీఆర్ఎస్ వీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు.
ఈకార్యక్రమంలో టీఆర్ ఎస్ వీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు మంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలిపారు. మంత్రి హరీష్ రావు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, హీరోయిన్ రెబ్బా, డైరెక్టర్ హరీష్ శంకర్, వంశీ పైడిపల్లితో పాటు పలువురు అభిమానులు ట్వీట్టర్ ద్వారా మంత్రికి జన్మదిన శుభాకాంక్షాలు తెలిపారు.