మెట్రో ఎండీని అభినందించిన మంత్రి కేటీఆర్…

228
ktr
- Advertisement -

హైద‌రాబాద్ మెట్రో రైలులో తొలిసారి బ్రెయిన్ డెడ్ అయిన మ‌నిషి గుండెను త‌ర‌లించారు. ఎల్బీన‌గ‌ర్ కామినేని ఆస్ప‌త్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి గుండెను త‌ర‌లించారు.

మెట్రో రైలులో గుండె త‌ర‌లింపుపై మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని కేటీఆర్ అభినందించారు. అవ‌య‌వ‌దాత న‌ర్సిరెడ్డి కుటుంబానికి మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఒక ప్రాణాన్ని కాపాడేందుకు గుండెను 21 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌త్యేక రైలును న‌డ‌ప‌డం హర్షించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు.

- Advertisement -