వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఆర్డీపీ) కింద నిర్మించిన చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ను మంగళవారం ప్రారంభిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. విశ్వనగరంలో మరోకలికితురాయిగా చాంద్రయాణ గుట్ట నిలవబోతుందన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా అవసరమైన చోట ప్రభుత్వం ఫ్లైఓవర్లను నిర్మిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 674 మీటర్ల పొడవున్న ఈ ఫ్లై ఓవర్‌ను రూ. 45.90 కోట్ల వ్యయంతో నిర్మించారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమం కింద హైదరాబాద్ నగరంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు ఉండొద్దనే ఉద్దేశంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్లు, లింక్ రోడ్లను ప్రభుత్వం నిర్మించింది. దీంతో అటు ప్రజలు, ఇటు వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తమ గమ్యస్థానాలకు త్వరితగతిన చేరుకుంటున్నారు.
రేపే చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ఓపెనింగ్: కేటీఆర్
- Advertisement -
- Advertisement -