- Advertisement -
జీహెచ్‌ఎంసీ విలీన గ్రామాలకు నీరందిస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్. మణికొండ అల్కాపురి టౌన్‌షిప్‌లో ఓఆర్ఆర్ ఫేజ్ 2 నీటి సరఫరా పనులకు శంకుస్ధాపన చేశారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..రూ.587 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలు, కాలనీలు ,గేటెడ్ కమ్యూనిటీలకు నీటి సరఫరా చేయనున్నామని చెప్పారు.
రూ.1200 కోట్ల వ్యయంతో ఓఆర్ఆర్ పరిధిలోని నివాస సముదాయాలకు నీటి సరఫరా చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలకే నీటి సరఫరా కోసం రూ. 6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు కేటీఆర్.కొండ పోచమ్మ సాగర్ నీటితో గండిపేట చెరువును నింపాలనేది సీఎం ఆలోచన అన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్,రాజేంద్రనగర్,కుత్బుల్లాపూర్,పటాన్‌చెరు నియోజకవర్గాల్లోని ఇళ్లకు కొత్త నీటి కనెక్షన్లు ఇవ్వనున్నారు.
- Advertisement -