- Advertisement -
హైదరాబాద్ మెట్రోలో కేంద్ర ప్రభుత్వం వాటా కేవలం 10శాతం మాత్రమే అన్నారు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో సభ్యులడిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కేంద్రం నుంచి ఇంకా రూ.250కోట్లు రావాల్సిఉందన్నారు. పాతబస్తీలోని మెట్రో రైలు ప్రాజెక్ట్ను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
ప్రభుత్వం ప్రజా రవాణాలో చాలా సీరియస్గా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో పెద్దఎత్తున నిధులు కేటాయించడం జరిగిందన్నారు. హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రతీ రోజు దాదాపు 4 లక్షల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు.
- Advertisement -