బ్రహ్మోత్సవాలకు స్పీకర్‌ పోచారంను ఆహ్వానించిన మంత్రి..

129
- Advertisement -

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ధర్మపురి లక్ష్మీ నరసింహా స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావలసిందిగా అసెంబ్లీలో శనివారం రోజునస్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించారు. స్పీకర్‌కు మంత్రి కండువా కప్పి, బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ధర్మపురి ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, నంబి శ్రీనివాసాచార్యులు శాస్త్రోక్తంగా స్పీకర్‌ను ఆశీర్వవచనం చేశారు.

మంత్రి వెంట కరీంనగర్ ఉమ్మడి జిల్లా డి.సి.ఎం.ఎస్ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మునిసిపల్ ఛైర్మన్ సత్తెమ్మ, వైస్ ఛైర్మన్ ఇందారపు రామన్న, బుగ్గారం జడ్పీటీసీ బి.రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అయ్యోరి రాజేష్, వైస్ ఛైర్మన్ సునీల్, టిఆర్ఎస్ ధర్మపురి పట్టణ శాఖ అధ్యక్షుడు చిలివేరి శ్యాంసుందర్, ఆలయ ఈ.వో.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా మంత్రి కొప్పుల కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు,మాజీ మంత్రి రాజేశం గౌడ్ లను కూడా బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.

- Advertisement -