‘సేఫ్ హ్యాండ్స్’ ఛాలెంజ్‌లో పాల్గొన్న మంత్రి కొప్పుల..

435
minister koppula
- Advertisement -

కరోనా వైరస్ బారిన పడకుండా పాటించాల్సిన జాగ్రత్త చర్యల్లో భాగంగా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీనిపై ప్రజలను చైతన్య పరుస్తున్న ‘సేఫ్ హ్యాండ్స్’ ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర పురపాలక ఐ.టి శాఖ మంత్రి కేటీఆర్ సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ స్వీకరించాలని కోరడంతో.. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.

ఈ క్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ లోని తన నివాసంలో చేతులను శుభ్రం చేసుకుంటూ ఓ ఫోటో ఫేర్ చేశారు. ప్రతి ఒక్కరూ శుభ్రతను పాటించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతోనే కరోనా వైరస్ వ్యాపించదని అన్నారు. అనంతరం, ఎంపీ వెంటేశ్ నేత, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, సంజయ్ కుమార్, బాల్క సుమన్, జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతలను సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌లో పాల్గొనాలని కోరారు.

- Advertisement -