అణగారిన వర్గాల ఆశాజ్యోతి డా. బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు మంత్రి కొప్పుల ఈశ్వర్. అంబేద్కర్ వర్దంతి సందర్బంగా నివాళి అర్పించిన కొప్పుల ఈశ్వర్…అంబేద్కర్ పోరాట ఫలితంగానే ఎస్సీ, ఎస్టీలకు విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజలందరి సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. చదువుతోనే ప్రగతి సాధ్యమని గుర్తించిన సీఎం…అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 గురుకులాలు ప్రకటించి, కేవలం ఆరేండ్లలోనే 671 విద్యాలయాలను ఏర్పాటు చేశారని తెలిపారు.
ఎస్సీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులు పూర్తిగా వారికే చెందాలన్న సంకల్పంతో ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని తీసుకువచ్చిన కేసీఆర్ గొప్ప పాలనాదక్షులని మంత్రి వివరించారు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు ఇష్టపడే విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద 20 లక్షల రూపాయలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని చెప్పారు.