మొక్కలు నాటడం సంతోషంగా ఉంది: కొప్పుల

264
koppula eshwar
- Advertisement -

సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మంత్రి హైదరాబాద్‌లోని క్యాంప్‌ ఆఫీస్‌లో మొక్కను నాటారు. భవిష్యత్‌ తరాలకు మనం అందించే గొప్ప కానుక పచ్చదనం, మంచి పర్యావరణమన్నారు. ఇందులో తాను కూడా భాగస్వామినవడం అదృష్టమన్నారు.

సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా తెలంగాణ భవన్ లో రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని ఇచ్చారు మంత్రి సత్యవతి రాథోడ్. అనంతరం ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి, శంభీపూర్ రాజు, జీహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ నేత‌ నూకల శ్రీ రంగారెడ్డితో కలిసి భవన్ లో మొక్క నాటారు.

- Advertisement -