ఫ్యామిలీని గుర్తుచేసుకోండి: రోడ్ సేఫ్టీపై ఎన్టీఆర్

363
ntr
- Advertisement -

ప్రతి ఒక్కరూ వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని…ఫ్యామిలీని గుర్తుచేసుకోవాలన్నారు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్. నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశంలో భాగంగా పెట్రోలింగ్ వాహనాలను ,రోడ్ సేఫ్టీపై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్.. ఇక్కడికి తాను నటుడిగా రాలేదని రోడ్డు ప్రమాదాల్లో ఫ్యామిలీలో ఇద్దరినీ కోల్పోయిన వ్యక్తిగా వచ్చామని తెలిపారు. అన్నయ్య, నాన్న ఇద్దరు రోడ్డు ప్రమాదాల వల్ల అర్దాంతరంగా వదిలేసి వెళ్లారని ..డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక్కసారి ఇంట్లో కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలన్నారు.

మీ రాక కోసం మీ భార్య కాని, మీ త‌ల్లిదండ్రుల‌కు కాని, మీ పిల్ల‌లు కాని మీ మీద ఆధార‌ప‌డ్డ‌ట్వంటి ఎంతోమంది కుటుంబ‌స‌భ్యులు మీ కోసం ఎదురుచూస్తుంటారన్నారు. ఇది మ‌న బాధ్య‌త‌గా తీసుకొని, మ‌న‌ల్ని మ‌నం స‌న్మార్గంలో తీసుకెళ్లాలి. మ‌నల్ని మ‌నం మార్చుకోవాలి. పౌరులంద‌రికీ ఇక్క‌డి నుంచి నేను విజ్ఞ‌ప్తి చేసేది ఒక‌టే. బాధ్య‌త‌ర‌హితంగా ప్ర‌వ‌ర్తించ‌కుండా మిమ్మ‌ల్ని మీరు మార్చుకోండి. బాధ్య‌త‌తో మీ కుటుంబ‌స‌భ్యుల కోసం మీరు మారేలా..మీ మార్గాన్ని మార్చుకునేలామిమ్మ‌ల్ని మీరు తీర్చిదిద్దుకోవాలన్నారు.

- Advertisement -