- Advertisement -
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ను గెలిపించాలన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. మసీదులు, దర్గాలు, కబ్రస్తాన్ నిర్మాణానికి, మరమ్మతుల కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా 135వ డివిజన్ వెంకటాపురంలోని బుర్హాని హౌసింగ్ సొసైటీ కాలనీలో ముస్లిం పెద్దలతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితా-కిషోర్‌ను తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముస్లిం, క్రిస్టియన్లను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ లాగా మాత్రమే వాడుకున్నాయని కొప్పుల ఈశ్వర్ అన్నారు. అలాగే కార్పొరేట్ విద్యకు దీటుగా 204 రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
- Advertisement -