BRS:తిరుగులేని రాజకీయ శక్తి

54
- Advertisement -

బీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగిందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం గోవిందుపల్లె గ్రామంలోని యంగ్ స్టార్స్ యూత్ అసోసియేషన్ యూత్ అధ్యక్షుడు కలమడుగు తిరుపతి ఆధ్వర్యంలో 50 మంది యూత్ సభ్యులు, బుగ్గారం మండలం శేకల్ల గ్రామం నుంచి కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి 20 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కొప్పుల… కాంగ్రెస్, బిజెపిలు ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాయని అందుకే అంతా బీఆర్ఎస్‌లో చేరుతారన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టి తెలంగాణను అన్ని రంగాల్లో ప్రగతిపథాన నడిపిస్తున్న కేసీఆర్‌ మహోన్నత నాయకుడు అని కొనియాడారు. మూడోసారి కూడా రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు.

Also Read:Modi:ఆర్ధిక శక్తిగా తెలంగాణ

పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. సీఎం కేసీఆర్‌ సుపరిపాలనకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందన్నారు.

Also Read:బెండకాయ సర్వ రోగనివారిణి అని తెలుసా..!

- Advertisement -