దేశం తెలంగాణ వైపు తిరిగి చూస్తుంది- మంత్రి కొప్పుల

321
Minister Koppula Eshwar
- Advertisement -

ముఖ్యమంత్రి కేసిఆర్ రూపొందించి, అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన నూతన రెవెన్యూ చట్టం నేడు ఆమోదం పొందడం పట్ల మంత్రులు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ఈ రోజు తెలంగాణ రాష్ర్టంలో చారిత్రాత్మక రోజు..దేశంలోనే కొత్త రెవెన్యూ చట్టం తెలంగాణ తీసుకొచ్చింది అన్నారు. ఇప్పటికి వరకు ఏ రాష్ట్రం తీసుకురాలేదు. భూముల పరిష్కారం కోసం కొత్త చట్టాన్ని సీఎం కేసీఆర్ తెచ్చారు.పేదలకు సామాన్యులకు లాభం చేకూరుతుంది.

రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఈ చట్టం కోసం మూడేళ్ళుగా కృషి చేసారు సీఎం కేసీఆర్.ఈ చట్టంతో రాష్ట్రంలో ఎంతోమంది కి లాభం చేకూరుతుంది..దేశం తెలంగాణ వైపు తిరిగి చూస్తుంది..వీఆర్ఏ లను రేగులార్ చేస్తామని చెప్పడం బడుగు బలహీన వర్గాల ఉద్యోగులకు భరోసా ఇచ్చారని మంత్రి కొప్పుల పేర్కొన్నారు.

- Advertisement -