దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వ కృషి: మంత్రి కొప్పుల

197
- Advertisement -

దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శనివారం పెద్దపెల్లిలోనే వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని మంత్రి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నెలకు రూ.500/- ఉన్న దివ్యాంగుల పెన్షన్ సీఎం కేసీఆర్ రూ.3016/- పెంచారని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది దివ్యాంగుల పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. రూ.1కోటీ 52 లక్షల విలువ గల పరికరాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తామని, మంచి చేస్తున్నామని మంత్రి తెలిపారు.

గతంలో కొంతమంది మాత్రమే పరికరాలు ఇచ్చేవారని, కానీ ప్రస్తుతం తెలంగాణ సర్కార్ ఆధునిక పరికరాలు అందిస్తున్నామని తెలిపారు.దివ్యాంగులకు సంక్షేమ పథకాలతో ధీమా కల్పిస్తూనే మానసిక స్థితితో పాటు చేతులు బాగుండి కాళ్ళు సరిగా పనిచేయని నడవలేని వారికి పైసా ఖర్చు లేకుండా ఛార్జింగ్ ట్రై సైకిల్ అందిస్తున్నామని తెలిపారు. ఉన్నత విద్యాభ్యాసం చేసే దివ్యాంగులకు టీవీఎస్ జూపిటర్ వాహనాలు విద్యార్థులకు లాప్టాప్ లు, 4జీ స్మార్ట్ ఫోన్లు, కదలేని వారికి బ్యాటరీ వీల్ చైర్ లు, కృత్రిమ అవయవాలు, క్యాలిపర్ స్టిక్స్ పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి తెలిపారు.

minister koppula

జడ్పీ చెర్మెన్ పుట్ట మధు మాట్లాడుతూ..జిల్లాలో మొత్తం 676 పైగా లబ్ధిదారులను ఎంపిక చేశామని, ప్రస్తుతం పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల తో పాటు ధర్మారం మండలానికి చెందిన 244 మంది దివ్యాంగుల్లో 112 మందికి బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్, 132 మందికి ఇతర సహాయ యంత్ర పరికరాలు అందిస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రతి పథకం లో 5% రిజర్వేషన్ అమలు చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎం.ఎల్.సి.నారదాసు లక్ష్మన్ రావు,అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి లక్ష్మీ రాజం, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -