రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే బాల్క సుమన్ కౌంటర్..

52
MLA Balka Suman

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో పెద్దవూర మండలంలోని పలు గ్రామాల ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. నిన్న రేవంత్ రెడ్డి పెద్ద‌వూర మండ‌లంలో ప్ర‌చారం సంద‌ర్భంగా టీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్య‌ల‌పై బాల్క సుమ‌న్ స్పందించారు. రేవంత్ రెడ్డి కొడంగల్‌లో తంతే మల్కాజిగిరిలో పడ్డాడని, ఇప్పుడు అక్కడ తంతే ఇంకెక్కడ పడతాడో చూసుకోవాలని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌కు పదవులు ఓ లెక్క కాదని, ఉద్యమం చేసి తెలంగాణ సాధించారని వెల్లడించారు. కేసీఆర్ ఉద్యమం చేస్తున్నప్పుడు నువ్వెక్కడున్నావ్? అంటూ రేవంత్‌పై మండిపడ్డారు. కొడంగల్‌లో ఘోర పరాజయం పాలైనప్పటికీ రేవంత్ కు సిగ్గు రాలేదని, ఆంధ్రా పాలకుల తొత్తుగా పనిచేసిన రేవంత్‌కు టీఆర్ఎస్, కేసీఆర్ పేరెత్తే హక్కులేదన్నారు.

పెద్దల గురించి అవాకులు చెవాకులు పేలుతూ ప్రస్తుతం రేవంత్ రెడ్డి శునకానందం అనుభవిస్తున్నాడని, మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని, చిప్పకూడు తినడం తథ్యమని బాల్క సుమన్ పేర్కొన్నారు. గతంలో పెయింటర్‌గా పనిచేసిన రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయలు ఎలా సంపాదించాడో చెప్పాలని ప్రశ్నించారు. మైకు దొరికితే చాలు కుక్కలాగా మొరుగుతుంటాడని విమర్శించారు. ‘నేనొక్క పిలుపు నిస్తే కార్యకర్తలు, అభిమానులు నీ సంగతేంటో చూస్తారు’ అని సుమన్ హెచ్చరించారు.