- Advertisement -
రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడగా తాజాగా మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. డాక్టర్ల సూచన మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అంతే కాదు, ఈ మధ్య తనను కలిసినవారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని.. తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి జగదీష్ రెడ్డి.
- Advertisement -