మేడారం జాతర…ఆర్టీసీ గుడ్‌న్యూస్

17
medaram

తెలంగాణ కంభమేళాగా ప్రసిద్ధి చెందిన వన దేవతల జాతర….మేడారం సమ్మక్క సారలమ్మ జాత ఫిబ్రవరి 16-19 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. 16న సారలమ్మ కన్నెపల్లి నుండి గద్దెపైకి రాక, 17న చిలకల గుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి రాక, 18న భక్తులకు అమ్మవార్ల దర్శనం, 19న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు.

ఈ నేపథ్యంలో మేడారం వెళ్లే సమ్మక్క, సారలమ్మ భక్తులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది టీఎస్‌ఆర్టీసీ. నేటి నుంచి మేడారంకు ప్రత్యేకంగా బస్సు సర్వీసులను నడపనుండగా హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి చార్జీలు పెద్దలు రూ. 125, పిల్లలకు రూ. 65చార్జీగా నిర్ణయించారు.