ఫ్లోరోసిస్ పాపం కాంగ్రెస్‌ది కాదా?:జగదీష్ రెడ్డి

46
- Advertisement -

ఫ్లోరోసిస్ పాపం కాంగ్రెస్‌ది కాదా? అని సూటిగా ప్రశ్నించారు మంత్రి జగదీష్ రెడ్డి.కరెంట్ ఫైల్స్ తీస్తామన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ పై సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి…వ్యవసాయానికి మూడు గంటల కరెంట్‌ కాంగ్రెస్ జాతీయ విధానమే. రాష్ట్రంలో కరెంటు లేదని ఒక్క రైతు అయినా రోడ్డెక్కాడా? అని ప్రశ్నించారు.

కరెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ దొరికిన దొంగ. 2014 ముందు మన వ్యవసాయం ఎలా ఉంది? రెండో పంట పండించిన భూములు ఎంత ? సాగునీళ్లు కాదు కదా తాగునీళ్లకే దిక్కు లేక ప్రజలు నానా కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. రైతుల చైతన్యం ముందు కాంగ్రెస్ కలలు, జిమ్మిక్కులు ఫలించవని, ప్రతి రైతు కాంగ్రెస్ కుట్రల పై చర్చించాలన్నారు. ఏఐసీసీ విధానాన్నే టీపీసీసీ పాటిస్తుందపి మండిపడ్డారు. మూడు గంటల కాంగ్రెస్‌ను నిలదీయండి .మూడు పంటల కేసీఆర్ వెంట నడువాలని రైతులకు పిలుపునిచ్చారు.

Also Read:బోడ కాకరకాయలు తింటే.. ఎన్నో రోగాలు దూరం!

ఏఐసీసీ దిగొచ్చినా కాంగ్రెస్ ఇక రైతుల నుంచి తప్పించుకోలేదని పేర్కొన్నారు. కరెంట్ కొనే విధానం పై కాంగ్రెస్ నాయకులకు కనీస అవగాహన లేకపోవడం శోచనీయమన్నారు.

Also Read:ముగిసిన కోదండరామస్వామి పవిత్రోత్సవాలు

- Advertisement -