బర్త్ డే…మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి

76
green challenge
- Advertisement -

తన పుట్టినరోజును సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మంత్రుల నివాస సముదాయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ భవన్లో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతమని ఇది పచ్చదనం పెంచడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకువస్తుందని పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు.

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. గత 3 సంవత్సరాలు నా పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం జరుగుతుందని భవిష్యత్తులో కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తానని తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గాదరి కిషోర్ కుమార్, రవీందర్ నాయక్, ఫైళ్ళ శేఖర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, బోల్లం మల్లయ్య యాదవ్, భాస్కర్ రావు, శానంపూడి సైదిరెడ్డి, చిలమర్తి లింగయ్య, పార్టీ కార్యాలయం ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -