ఎస్సీల అభివృద్ధికి కృషి ప్రభుత్వం చేస్తుంది…

231
Minister Jagadishreddy
- Advertisement -

ఎస్సీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రికార్డ్ స్థాయిలో ఖర్చు పెడుతుందని రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఒక్క 2017-18 లో పెట్టిన ఖర్చు 10178 కోట్లు అని ఆయన చెప్పారు. డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ స్ఫూర్తి తోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల అభివృద్దికి సంక్షేమ పథకాలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన ఎస్సీల అభివృద్ధికి ప్రత్యేక నిధి చట్టం అమలు తీరుపై మంగళవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Minister Jagadishreddy

ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, ఎస్సీ అభివృద్ధి శాఖా కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాశ్ ,సంచాలకులు కరుణాకర్,సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ యస్ ప్రవీణ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ యం.డి. లచ్చిరాం నాయక్ తదితరులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 2010-11 లో ఎస్సీల అభివృద్దికి అప్పటి రాష్ట్ర ప్రబుత్వం పెట్టిన ఖర్చు 1170 కోట్ల రూపాయలు మాత్రమేనని ఆయన వివరించారు. చదువుకు ఉన్న ప్రాముఖ్యతను మొట్టమొదట గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆరే అని ఆయన తెలిపారు. ఒక తరాన్ని విద్యాపరంగా ప్రోత్సహం కల్పిస్తే భవిష్యత్ అద్బుతంగా మలచ వచ్చు అన్నది సీఎం కేసీఆర్ బావన అని ఆయన చెప్పుకొచ్చారు. ఉద్యమ సమయంలోనే కేజీ టు పిజి విద్యకోసం ఆలోచించిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని అందులో బాగంగానే గురుకుల పాటశాలలు స్థాపించి సత్ఫలితాలు సాదిస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

Minister Jagadishreddy

అయితే అదే సమయంలో దళితులకు 3 ఎకరాల పంపిణీ విషయంలో వేగం తగ్గిన మాట వాస్తవమేనని మంత్రి జగదీష్ రెడ్డి అంగీకరించారు. ఇప్పుడున్న పరిస్తితులలో రైతులు కూడా భూములు అమ్మేందుకు ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. భూముల అమ్మితే కొని దళితులకు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. దళితులకు ముడుఎకరాల భూపంపిణి నిరంతర ప్రక్రియ అని, అది భూములు అమ్మే వారు ఉంటె కొనుగోలు చేసేందుకు ప్రబుత్వం ఎప్పుడు సిద్దంగా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు భూపంపిణి విషయంలో రాష్ట్ర ప్రబుత్వం పెట్టిన ఖర్చు 2837.23 కోట్లు ఖర్చుపెట్టి నట్లు ఆయన వెల్లడించారు.

Minister Jagadishreddy

రాష్ట్రంలో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడంతో భూముల రేట్లు పెరిగాయని ఆయన తెలిపారు. రైతాంగం మేలు చేసే దిశగా మా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి విద్యతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు.1000, 1500 పెన్షన్ తో పాటు కళ్యాణ లక్ష్మీ, హాస్టల్ లో సన్న బియ్యం, విదేశీ విద్య కోసం 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఎస్సీల అభివృద్ధి పై పెడుతున్న ఖర్చు పై ప్రతి మూడు నెలలకోసారి సమీక్షా సమవేశం నిర్వహిస్తూ సీఎం కేసీఆర్ మార్గదర్శనం మేరకు దళితుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

- Advertisement -