టీఆర్ఎస్ హయాంలోనే కులవృత్తులకు ఆదరణ:జగదీష్ రెడ్డి

254
jagadish
- Advertisement -

గత పాలకుల హయాం లో ఆదరణ కోల్పోయిన కుల వృతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణం పోశారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.కుల వృతులను ప్రోత్సహించడం లో భాగంగానే దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ఉచితంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి అన్నారు.

గురువారం కాళేశ్వరం ఆయకట్టు చివరి చెరువు అయిన పెన్ పహాడ్ మండలం మాచారం గ్రామంలో ని రావి చెరువు తో పాటు తన దత్తత గ్రామం అయిన చీదేళ్ల పెద్ద చెరువు రెండు లక్షల చేపపిల్లలను వదిలారు.జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి , మండల ఎంపీపీ నెమ్మాది బిక్షం, జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య లతో పాటు జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాగాని, సూర్యపేట జడ్పిటిసి జీడీ బిక్షం,లతో కలిసి చేప పిల్లలను వదిలిన అనంతర మంత్రి మాట్లాడుతూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే దృఢసంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

మత్స్యకారుల సంక్షేమం కోసం ఉచితంగా 80 కోట్ల చేపపిల్లలు, 5 కోట్ల రొయ్యపిల్లలను చెరువుల్లో వేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. సముద్ర తీర ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం లేదన్న మంత్రి …అట్లాంటి రాష్ట్రాలతో మత్యసంపదలో పోటీపడి నీలివిప్లవం వైపు పయనిస్తున్నామన్నారు..ముఖ్యమంత్రి కేసీఆర్ మత్యకారుల మోముల్లో సంతోషం నింపారన్నారు.తడి ఆరిన తెలంగాణ బీడు భూములను తడిపి సస్యశ్యామలం చేస్తూ గోదావరి జలాలు అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతానికి పునరుజ్జీవం పోస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

కాళేశ్వరం జలాలతో తెలంగాణ పల్లెలు కోనసీమను తలపిస్తున్నాయని, చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని మంత్రి కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ మత్స్య సంపదకు పెద్దపీట వేశారన్నారు. గత పాలకులు మత్స్య కారులను గుర్తించిన దాఖలాలు లేవన్నారు. ఇంత అద్భుతమైన ప్రాజెక్టును నిర్మించి కాలువల ద్వారా జలాలను వదలడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. సీఎం కేసీఆర్‌ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని కులవృత్తులను చేసుకుని బతుకుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఐదేండ్లలో ఉచిత చేపపిల్లలను పిల్లలను ప్రాజెక్టులు, చెరువుల్లో వదులుతున్నామన్నారు.

నిన్నమొన్నటి వర్షాలకు చెరువుల ఒడ్డుకు చేపపిల్లలు రావడంతో వందలాది మత్స్య కారులు వాటిని పట్టుకున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చెరువు, కుంట, ప్రాజెక్టుల్లో ఉచితంగా చేపపిల్లలను వదిలిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకు వందలాది కోట్లతో ద్విచక్రవాహనాలు, బొలెరో వాహనాలు, పనిముట్లు అందించామన్నారు.కార్యక్రమంలో చీదేళ్ల సర్పంచ్ పరెడ్డి సీతారాం రెడ్డి, మాచారం సర్పంచ్ బొబ్బయ్య, ఇతర గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీ లు,మండల,జిల్లా నాయకులు ,అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -