తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది..

277
Minister Jagadish Reddy On Corona
- Advertisement -

లాక్ డౌన్ నేపద్యంలో సబ్బంఢ వర్గాలకు సకల సౌకర్యాల్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిల్చిందని స్పష్టం చేశారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. కరోనా పరిస్దితులు,ధాన్యం కొనుగోళ్ళపై సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు స్వచ్చంధ సంస్దలు వితరణ చేసిన బియ్యం, నిత్యవసర వస్తువులను ఆశా వర్కర్లకు, ఆరోగ్య సిబ్బందికి అందజేశారు మంత్రి జగదీష్ రెడ్డి.

Minister Jagadish Reddy On Corona

లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్కరు ఆకలితో ఇబ్బంది పడొద్దని ముఖ్యమంత్రి కెసీఆర్ ఇతర రాష్ట్రాల నుంచి వసల వచ్చిన కార్మీకులకు, రేషన్ కార్డ్ లేని వారికి కూడా బియ్యం, ఆర్దిక సాయాన్ని అందజేశారని మంత్రి అన్నారు. ఈ ఆపత్కాంలో పేదలకు, ఆరోగ్య సిబ్బందికి అన్ని విధాల అండగా నిలుస్తున్న స్వచ్చంధ సంస్దలకు,నాయకులకుమంత్రి జగదీష్ రెడ్డి క్రుతజ్ఠతలు తెల్పారు.

- Advertisement -