ఈబిజీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం..

236
Minister KTR Weeting With EBG Representatives
Minister KTR Weeting With EBG Representatives..
- Advertisement -

భారత దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామిక వర్గాలు దేశంలో అసలైన యాక్షన్ మొత్తం రాష్ట్రాల్లోనే ఉన్నదని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు అన్నారు. ఇప్పటికి భారతదేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పట్ల విదేశీ పెట్టుబడిదారులు వివిధ అభిప్రాయాలు ఉన్నప్పటికీ దేశంలోని తెలంగాణ లాంటి పలు రాష్ట్రాలు మాత్రం అత్యుత్తమ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమాణాల్లో అగ్రస్థానంలో ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు ఇవ్వాల్సి వస్తే ప్రపంచంలోనే టాప్ 20 స్థానంలో నిలుస్తుందన్నారు. అందుకే విదేశీ పెట్టుబడిదారులు భారతదేశాన్ని స్థూలంగా కాకుండా రాష్ట్రాల కోణాల్లోంచి చూడాల్సిన అవసరం ఉండదని, ఇలాంటి పరిస్థితి ఏర్పడితే తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఈరోజు యూరోపియన్ బిజినెస్ గ్రూప్- ఈబిజీ (EBG) ప్రతినిధులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మంత్రి పలు దేశాల రాయబారులు మరియు వివిధ దేశాలోని ప్రముఖ కంపెనీల సీనియర్ ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమిటో దేశంతోపాటు ప్రపంచానికి చూపించిందని, గత ఐదు సంవత్సరాలలో టీఎస్ ఐపాస్ ద్వారా సుమారు 13వేల కంపెనీలకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ భారత దేశంలోనే అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానాల్లో ఒకటిగా ఉన్నదని, ఇందుకు ఇక్కడి ప్రభుత్వ పరిపాలన మరియు విధానాలే కారణమని తెలిపారు.

Minister KTR Weeting With EBG Representatives

కేవలం పెట్టుబడి అనుకూల విధానాలు కాకుండా పరిశ్రమల వ్యాపార నిర్వహణ కోసం అవసరమైన అనేక చర్యలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇందుకోసం ఇన్నోవేషన్ ఈకో సిస్టమ్ కోసం టీ హబ్, వి హబ్, టీ వర్క్స్ వంటి వాటిని ప్రారంభించామని, తెలంగాణ అకాడమీ ఆఫ్ నాలేజ్ అండ్ స్కిల్ (టాస్క్) ద్వారా నైపుణ్య శిక్షణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రత్యేక పంథాలో ముందుకు పోతున్నదని మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు ప్రపంచ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోవని, గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రపంచవ్యాప్తంగా వినిపించాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మంత్రి అభిప్రాయపడ్డారు. తమ విధానాల ద్వారా పారిశ్రామిక అనుమతుల విషయంలో అవినీతి లేకుండా పూర్తి స్థాయి పారదర్శకతకు అవకాశం లభించిందని, సుస్థిరమైన పాలసీ కంటిన్యుటీ ఉన్నదని తెలియజేశారు.

ప్రస్తుతం ఎదురవుతున్న కరోనా వైరస్ సంక్షోభంలోనూ అనేక పారిశ్రామిక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని తాము భావిస్తున్నట్లు తెలిపిన మంత్రి, ప్రస్తుత సంక్షోభం వలన అటు పరిశ్రమలతో పాటు ప్రభుత్వాలు తమ ప్రాధాన్యతలను పునః సమీక్షించుకోవలసిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ మేరకు అనేక కంపెనీలు ఒకే దేశంలో లేదా ఒకే చోట పూర్తిస్థాయిలో పెట్టుబడులు పెట్టె అంశాన్ని పునరాలోచించుకుంటున్న నేపథ్యంలో భారత దేశానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుందని ఇందుకోసం వివిధ దేశాల్లోని పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకుని వాటిని ఇక్కడికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని తెలిపారు.

ఇందుకోసం ప్రత్యేకంగా ఆయా దేశాల్లోని పెట్టుబడి దారులు లేదా కంపెనీల ప్రతినిధులతో రానున్న కొద్ది రోజుల్లో ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు సహకరించాలని వివిధ దేశాల రాయబారులు మంత్రి ఈ సందర్భంగా కోరారు. తెలంగాణ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్,ఐటీ, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, టెక్స్టైల్ వంటి రంగాలకు సంబంధించి పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని వివిధ పరిశ్రమల ప్రతినిధులను మంత్రి ఈ సందర్భంగా కోరారు.

- Advertisement -