రెండురోజుల్లో ఆరెంజ్ జోన్‌లోకి సూర్యాపేట..

383
minister jagadeesh
- Advertisement -

సూర్యాపేట జిల్లా మరో రెండు రోజుల్లో ఆరెంజ్ జోన్ లోకి వస్తుందని,ప్రజలు ఎప్పటిలాగానే స్వీయ నియంత్రణ పాటించి, కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజల సౌకర్యార్థం సూర్యాపేట పట్టణంలోని పలు కాలనీ లాల్లో కూరగాయల మార్కెట్లను ప్రారంభించారు మంత్రి జగదీష్ రెడ్డి.

సూర్యాపేట జిల్లాలో గత 19 రోజులుగా ఒక్క పాజిటివ్ కేస్ కూడా నమోదు కాలేదని, ప్రజల సహకారం ,అధికారులు సమన్వయం వల్లనే సాధ్యం అయిందని జగదీష్ రెడ్డి అన్నారు..జిల్లాలో ఇప్పటివరకు 83 పాజిటివ్ కేస్ లు నమోదు కాగా 57 మంది కోలుకుని పూర్తి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారని మంత్రి తెలిపారు.

లాక్ డౌన్ సడలింపులను ప్రజలు తేలికగా తీసుకోవద్దని, తగిన జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వ్యాధి దరి చేరకుండా ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు..ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ ,అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -