నేలతల్లిని కాపాడుతాం:జగదీష్ రెడ్డి

467
jagadeesh reddy
- Advertisement -

భూమి కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు సుస్థిరమైన, స్థిరమైన సజీవ వనరుగా అందించడం మన బాధ్యత అని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి లో ని అరవిందో కృషి వ్యవసాయ విజ్ఞాన కేంద్రం లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి తో కలిసి ప్రపంచ భూ దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి లు విజ్ఞాన కేంద్రం ఆవరణలో రైతులు ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శన కిసాన్ మేళా ను ప్రారంబించడం తో పాటు కోటి రూపాయల వ్యయం తో నూతనంగా నిర్మించిన విత్తన శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం సభా ప్రాంగణం వద్ద దివంగత వ్యవసాయ శాస్త్ర వేత్త గోపాల్ రెడ్డి గారి చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించి రాబోయే కాలంలో నేల తల్లి ని కాపాడుతామని రైతులతో ప్రతిజ్ఞ చేపించారు మంత్రి జగదీష్ రెడ్డి.

అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నేల కలుషితం కాకుండా సహజ సూక్ష్మజీవుల పరిరక్షణ కోసం, నేల జీవ శక్తిని కొనసాగించే ఉద్దేశంతోనూ ప్రపంచ నేలల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.విపరీతమైన ఎరువులు, పురుగు మందులు, ఇతర రసాయన ఉత్పాదకాల వాడకంతో నేల స్వభావమే మారిపోతోందని మంత్రి ఆవేదనవ్యక్తం చేశారు.అవసరానికి మించి ఎరువులు వాడటం వల్ల భూమి ని చంపుకుంటున్నామని రైతుల ను ఉద్దేశించి మంత్రి అన్నారు.. ఎక్కువ ఎరువులు వాడటం వల్ల నేల సారం కోల్పోయి దిగుబడులు తగ్గి చివరి అది ఆత్మహత్య లకు దారితీస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం సాగర్ ఆయకట్టు ప్రాంతంలో పంట అనంతరం భూముల ను కాల్చుతున్నారన్నారు.. అలా చేయడం రైతులు తమ చేతులను తామే కాలచుకోవడమే అన్నారు.. అలా చేస్తే పంటకు ఉపయోగ పడే బ్యాక్టీరియా నశించి పోతుందని మంత్రి అన్నారు.

తెలంగాణలో 22 రకాల నేలలు ఉన్నాయన్నారు. నల్ల, ఎర్ర నేలల్లోనే అనేక రకాలు ఉన్నాయన్నారు. నీటి నిలువ సామర్థ్యం, పోషకాల లభ్యత నేల స్వభావం బట్టి ఉంటుందన్నారు. మన రాష్ట్రంలో అక్కడక్కడా చౌడు భూములు ఉన్నాయని వాటిని కూడా సాగులోకి తేగలమని అన్నారు. మన నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువగా ఉందన్నారు. దీనిని సరిచేయడానికి పచ్చిరొట్ట ఎరువులు వాడాలని మంత్రి జగదీష్ రెడ్డి రైతులకు సూచించారు. ప్లాస్టిక్ వినియోగం నుంచి భూమాతను రక్షించే ప్రయత్నంలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు.మరో మంత్రి సింగిరెడ్డి మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం లో విత్తన శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించే అవకాశం రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రాన్ని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణా నేలల్లో సూక్ష్మపోషకాల లోపాలు కూడా ఉన్నాయన్నారు.. సేంద్రియ ఎరువులు ఉపయోగించడం ద్వారా ఆ లోపాలను అధిగమించవచ్చన్నారు. విశ్వం లో మానవ మనుగడకు భూ గ్రహం ఒక్కటే అనువుగా ఉంటుందని భూ గృహం తప్ప మరే గ్రహం లో మానవుల మనుగడ కు అనువుగా లేదన్నారు.. కాబట్టి ఇప్పటి నుండే మన పిల్లలకు అవగాహన కల్పించడం ద్వారా మనం పెద్ద పుణ్యం చేసుకున్న వారమవుతామన్నారు. శాస్త్ర సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా ఆహారం మాత్రం తప్పనిసరి గా వ్యవసాయం చేయడం ద్వారానే వస్తుందన్నారు. కాబట్టి భవిష్యత్ లో దేశం లో వ్యవసాయం మంచి లాభదాయకంగా ఉంటుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రైతుల కోసం ఎక్కువ బడ్జెట్ ను కేటాయిస్తున్న రాష్ట్రం కేవలం ఒక్క తెలంగాణే అని మంత్రి అన్నారు.

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వ్యవసాయ సంస్కరణల ను పెద్ద ఎత్తున తీసుకువస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులు కేవలం వరి పంట వైపు మాత్రమే దృష్టిసారించకుండా ఆయిల్ ఫామ్ వంటి ఇతర పంట ల పై దృష్టిసారించాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలైన సూర్యాపేట, వనపర్తి లు వాణిజ్య కేంద్రాలుగా నిలుస్తున్నాయాన్నారు. వీటి తో పాటు వ్యవసాయ ఉత్పత్తులద్వారా కొత్త గా ఏర్పడిన ప్రతీ జిల్లా ఒక వాణిజ్య కేంద్రంగా నిలుస్తుందన్నారు.రాష్ట్రంలో లో 216 మండలాలు ఆయిల్ ఫామ్ పంటలకు సాగు కు అనుకూలంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం జరిపించిన సర్వే లో వెల్లడి అయిందని మంత్రి అన్నారు.భవిష్యత్ లో ప్రపంచానికి ఆహార పంటలు ఎగుమతి చేయడానికి అన్ని విధాలా అనువైన ప్రాంతం గా తెలంగాణ రాష్ట్రం ఉండనుందన్నారు. భవిష్యత్ లో తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయం లో తలమానికం తీర్చిదిద్దుతామన్నారు. గా . నత్రజని వాడకాన్ని సగానికి తగ్గించవచ్చాన్నారు. దీని వలన ఖర్చు తగ్గడమేకాక నేలను పరిరక్షించవచ్చని అన్నారు. ఒక ఇంచు నేల ఏర్పడడానికి వందల సంవత్సరాలు పడుతుందన్నారు. 60 శాతం బోరుబావులు చాలా లోతునుండి నీళ్ళు తోడడం వల్ల లవణాలు పైకి వచ్చి నేలపై పొరగా ఏర్పడి దిగుబడులు తగ్గుతున్నాయన్నారు. నేలపై మంచి మార్పు అయినా, చెడ్డ మార్పు అయినా చాలా నెమ్మదిగా వస్తుందన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి నేలను అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు.మన మూలలను నిలబెట్టే ఏకైక ఆధారం భూమి మాత్రమే అన్న మంత్రి రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్య కారకాల నుంచి పర్యావరణ మార్పుల నుంచి భూమిని కాపాడుకోవడంలో ప్రధానపాత్ర పచ్చదన పెంపు ఒక్కటే అన్న మంత్రి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పచ్చదనం పెంచడానికి హరిత హారం కార్యక్రమాన్ని ఉద్యమం లా చేపడుతామని మంత్రి తెలిపారు.

భూమాతకు పచ్చని ఆభరణమైన తెలంగాణకు హరితహారంలో పాల్గొనడం ద్వారా తెలంగాణను ఆకుపచ్చని రాష్ట్రంగా మారుద్దామన్నారు.విచక్షణా రహితంగా ఎరువులు, పురుగుమందులను రైతులు ఇప్పటికీ వాడుతూనే ఉన్నారని ,దీనివలన నేలలో జీవ పదార్ధం తగ్గిపోతుందన్నారు. భూసార పరీక్ష ఫలితాలను బట్టి ఎరువులు సమతుల్యంగా వాడాలి కానీ చాలామంది రైతులు డీఏపీతో పాటు పొటాష్ వేయటం లేదన్నారు.రసాయన ఎరువులు ఎక్కువ వాడకం వల్ల పురుగూ, తెగుళ్లు పెరుగుతున్నాయన్నారు.. కాబట్టి రైతులు సేంద్రియ వ్యవసాయం పై దృష్టి సారించి నేల తల్లి ని కాపాడాలని మంత్రి సూచించారు. స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ కృషి విజ్జా న కేంద్రం ను వ్యవసాయ కళా శాల గా మార్చాలని మంత్రులను కోరారు.వ్యవసాయ అభివృద్ధి కి పాటుపడిన దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త గోపాల్ రెడ్డి గారిని పద్మ భూషణ్ అవార్డు కు ప్రభుత్వం తరపున నామినేట్ చేయాలని సైదిరెడ్డి కోరారు.

ఈ కార్యక్రమం లో విజ్ఞాన కేంద్ర అటార్నీ జనరల్ ప్రసాద్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రాజాక్, జడ్పిటిసి లు జీడీ బిక్షం ,నెమ్మాది బిక్షం, సంజీవ్ నాయక్, మామిడి అనితఅంజయ్య ,స్థానిక ప్రజాపతినిధులు, రైతులు, రైతు సమన్వయ సమితి సభ్యులు పాల్గొన్నారు.

minister jagadeesh reddy speech at Suryapet…minister jagadeesh reddy speech at Suryapet..minister jagadeesh reddy speech at Suryapet

- Advertisement -