బాల్క సుమన్‌ను ప‌రామ‌ర్శించిన మంత్రి ఐకే రెడ్డి..

213
Minister Indrakaran Reddy
- Advertisement -

తండ్రి మ‌ర‌ణంతో విషాదంలో ఉన్న ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శ‌నివారం ప‌రామ‌ర్శించారు. మెట్ పల్లి పట్టణ సమీపంలోని రేగుంటలోని బాల్క సుమన్ ఇంటికి వచ్చిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి… ఆయనను ఓదార్చి, త‌మ ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. బాల్క సురేష్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. మంత్రి వెంట టీఆర్ఎస్ నాయకులు రాంకిషన్ రెడ్డి, శ్రీహరి రావు, తదితరులు ఉన్నారు.

- Advertisement -