కేర‌ళ‌లో మరోసారి లాక్‌డౌన్‌ పొడిగింపు..

130
Pinarayi Vijayan

కేర‌ళ‌లో క‌రోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడికి విధించిన‌ లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం జూన్ 9 వ‌ర‌కూ పొడిగించింది. ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న లాక్‌డౌన్ ఈ నెల 30తో ముగుస్తున్న నేప‌థ్యంలో కేర‌ళ ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతుండ‌టంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్నా ఆహారోత్ప‌త్తులు, కిరాణా షాపులు, పండ్లు, కూర‌గాయ‌ల దుకాణాలు, డైరీ, మాంసం ఉత్ప‌త్తుల అవుట్ లెట్ల‌ను రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కూ తెరిచేందుకు అనుమ‌తిస్తారు. బ్యాంకులు మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కూ ప‌నిచేస్తాయి.