ఇటలీలో ‘థ్యాంక్యూ’.. రాశీఖ‌న్నా కామెంట్స్‌..

163
Raashi Khanna

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తోన్న చిత్రం థ్యాంక్యూ. విక్ర‌మ్ కుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీమ్ ఇటలీ వెళ్లి అక్కడ కొంతవరకూ షూటింగు పూర్తిచేసుకుని వచ్చింది. ఇట‌లీ షూటింగ్ షెడ్యూల్ గురించి మీడియా ప్ర‌శ్నించ‌గా రాశీఖ‌న్నా స్పందిస్తూ.. కోవిడ్ నేప‌థ్యంలో ఇట‌లీ వెళ్లేందుకు చాలా భ‌య‌ప‌డిన‌ట్టు చెప్పింది.

ఇండియాలో ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితుల్లో ఉన్నాము. అలాంటిది షూటింగు కోసం ఏకంగా ఇటలీ వెళ్లవలసి వచ్చింది. ఇటలీ వెళ్లినప్పటికీ అందరిలోను టెన్షన్ ఉంది. అక్కడ కొన్ని లొకేషన్స్ లో కరోనా కేసులు బయటపడటంతో అనుమతులు లభించలేదు. దాంతో మా టెన్షన్ మరింత పెరిగిపోయింది. ఎప్పుడు పరిస్థితులు ఎలా మారతాయోనని కంగారుపడ్డాం. మేము ఒక్కో రోజు 18 గంట‌లపాటు షూటింగ్స్ లో పాల్గొని..వేగంగా పూర్తి చేశామని చెప్పుకొచ్చింది.