పత్తికి గిట్టుబాటు ధర కల్పిస్తాం: ఐకే రెడ్డి

242
ik reddy
- Advertisement -

ప‌త్తి పంట‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించి ప్ర‌భుత్వ‌మే పంట‌ను కొనుగోలు చేస్తుంద‌న్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. దేశంలో ఆదిలాబాద్ జిల్లా పత్తికి మంచి పేరుందన్నారు. సీసీఐ ఆధ్వర్యంలో నిర్మ‌ల్‌లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఇంద్రకరణ్ రెడ్డి…రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తుందన్నారు.నిర్మల్ జిల్లాలో 24 ప‌త్తి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయ‌ని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు లాంటి పథకాలను అమలుచేస్తున్న‌ద‌ని తెలిపారు.

దేశంలోనే ఆదిలాబాద్ జిల్లా పత్తికి మంచి పేరుందని సీఎం కేసీఆర్ కొనియాడార‌న్నారు. ఈక్ర‌మంలో నిర్మల్ ప‌ట్ట‌ణంలో మొదటి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామ‌న్నారు. మిగిలిన దేశాల‌తో పోలిస్తే మ‌న దేశంలోనే ప‌త్తి ధ‌ర ఎక్కువగా ఉందన్నారు. సీసీఐ కూడా ఇబ్బందులు లేకుండా పత్తి కోనుగోలు చేస్తుంద‌ని చెప్పారు.

- Advertisement -