తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి సమీక్ష..

207
minister
- Advertisement -

సోమవారం మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో దేవదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌తో సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 20 నుండి పది రోజులపాటు జరగనున్నాయి. పుష్కారాలకు పకబ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 2.5 కోట్లు విడుదల చేసిందని మంత్రి తెలిపారు. ఈ నిధులతో పుష్కరఘాట్ల వద్ద మౌలిక వసతులతోపాటు, అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని మంత్రి చెప్పారు.

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని, నది ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పుష్కర ఘాట్ల వద్ద కంచె ఏర్పాటు చేయాలన్నారు. గజ ఈతగాళ్లను, రెస్క్యూ బోట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పుష్కరాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, భక్తులు నిబంధనలు పాటిస్తూ పూజలు, పిండ ప్రదానాలు చేసుకోవాలని మంత్రి కోరారు.

- Advertisement -