రైతే రాజు అనే క‌ల‌ను సీఎం కేసీఆర్ నిజం చేశారు..

101
Minister Indrakaran Reddy
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం వ‌చ్చాక సీఎం కేసీఆర్ రైతే రాజు అనే క‌ల‌ను నిజం చేశారు అని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కొనియాడారు. నిర్మల్‌ జిల్లా అంబేద్కర్ భ‌వ‌న్‌లో సోమ‌వారం నిర్వ‌హించిన‌ వానాకాలం పంట‌ల సాగు సన్నద్ధత- అవ‌గాహ‌న‌ సదస్సులో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ.. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రైతు రాజ్యం అనే నినాదంతో ప్రభుత్వాలు పబ్బం గ‌డుపుకున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం వ‌చ్చాక సీఎం కేసీఆర్ రైతే రాజు అనే క‌ల‌ను నిజం చేశారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో చేపట్టిన జలవికాస కార్యక్రమాలతో పుష్కల సాగునీటి వసతి రైతులకు అందుబాటులోకి వచ్చింది. ఉచిత కరెంటు, పెట్టుబడిసాయం అందుతున్నది. రైతు సంక్షేమ పథకాలు భరోసాను నింపాయి అన్నారు.

సాగు కష్టాలు తీరడంతో కొద్దికాలంగా రైతులందరూ ఒకేరకమైన పంటలను సాగు చేస్తున్నారని, అలా కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేలా వ్యవసాయ అధికారులు రైతులను ప్రోత్సహించాలి అన్నారు. లాభదాయక పంటల సాగుపై ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయాలి. ప్రత్యామ్నాయ పంటల ద్వారా కూడా అధిక లాభాలు పొందవచ్చు. రైతులు కూడా సహకరించి వ్యవసాయ శాఖ తెలియజేసిన సూచనలు సలహాలు పాటించాలి అని మంత్రి కోరారు.

ఈ కార్య‌క్ర‌మానికి జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ కే.విజ‌య‌ల‌క్ష్మి రెడ్డి, ఎమ్మెల్యేలు, విఠల్ రెడ్డి ,రేఖా శ్యాంనాయ‌క్, రాథోడ్ బాపురావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, క‌లెక్టర్ ముశ్ర‌ఫ్ ఫారూఖీ అలీ, నిర్మ‌ల్ జిల్లా రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షులు న‌ల్లా వెంక‌ట్రామ్ రెడ్డి, అగ్రోస్ ఎండీ రాములు, రైతులు, వ్య‌వసాయ, ఇత‌ర శాఖ‌ల అధికారులు హాజ‌ర‌య్యారు.

- Advertisement -