నిర్మల్ పట్టణం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్ లను శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజల కోసం ఎన్టీఆర్ స్టేడియంలో రెండు ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేశామని ఎక్సర్ సైజ్ కి సంబంధించిన అన్ని ఇక్కడ అందుబాటులో ఉంచామని తెలిపారు. ఆరోగ్యకర జీవితం కోసం ప్రతి ఒక్కరు రోజు వ్యాయామం చేయాలని నిర్మల్ ఎన్టీఆర్ స్టేడియాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్నామని ఇండోర్ స్టేడియంగా ఎన్టీఆర్ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
17 వ శతాబ్దానికి చెందిన పురాతన శ్యామ్ ఘడ్ ఫోర్ట్ కు లైటింగ్‌తో మంచి శోభ వచ్చిందన్నారు..కంచరోని చెరువులో బోటింగ్ ఏర్పాటు చేసి ధర్మసాగర్ మిని ట్యాంక్ బండ్ లో మిగిలి ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలలో అన్ని జిల్లాల కన్నా నిర్మల్ జిల్లాను అభివృద్ధిలో ముందు ఉంచడానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం కాసేపు మంత్రి కలెక్టర్లు, జడ్పి చైర్ పర్సన్, మున్సిపల్ చైర్మన్ లతో కలిసి క్రికెట్ ప్రాక్టీసు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్ పర్సన్ విజయ రాంకిషన్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్, అదనపు కలెక్టర్ హేమంత్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మున్సిపల్ కమిషనర్ బాలక్రిష్ణ, ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ ధర్మజి రాజేందర్, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.