మంత్రి పువ్వాడకు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు..

52
minister puvvada

నూతన సంవత్సరం-2021 వేడుకలలో భాగంగా ఖైరతాబాద్ రవాణ శాఖ ప్రధాన కార్యాలయంలో న్యూ ఇయర్‌ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రవాణ, ఆర్టీసీ అధికారులతో కలిసి రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేక్ కట్ చేశారు. అధికారులకు, ఉద్యోగులకు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసి ఎండి సునీల్ శర్మ, ట్రాన్స్‌పోర్ట్‌ కమీషనర్ ఎంఆర్ఎం రావు, డిప్యూటి సెక్రేటరి విజయేంద్ర, ఆర్టీసి ఈడిలు, జేటిసిలు, డిటీసిలు రవాణా, ఆర్టీసీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.