8న ఎన్నికల ఖర్చులపై ఎస్‌ఈసీ సమీక్ష..

25
SEC

జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన ఖర్చులను అభ్యర్థులు సకాలంలో సమర్పించని పక్షంలో అనర్హతకు గురయ్యే అవకాశం ఉంటుందని, ఈనెల 8వ తేదీన ఎన్నికల ఎక్ష్పెండిచర్ అబ్సర్వర్లతో ఎన్నికల ఖర్చులపై సమీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఆర్. పార్థసారథి తెలిపారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు జిహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమీషనర్లు, జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను కలిసారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మాట్లాడుతూ జిహెచ్ఎంసీ ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థుల జాబితాను గెజిట్‌లో ప్రచురించాల్సి ఉన్నందున జాబితాను వెంటనె సమర్పించాల్సిందిగా ఎన్నికల అధికారిని కోరారు.

శుభాకాంక్షలు తెలిపిన వారిలో మునిసిపల్ అడ్మినిస్ట్రెషన్ సంచాలకులు డాక్టర్ సత్యనారాయణ, ఎంఎయుడి సెక్రటరి సుదర్శన్, మునిసిపల్ శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ సిబ్బంది తదితరులు ఉన్నారు.