అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ ముందంజ- మంత్రి

119
minister allola
- Advertisement -

గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా గురువారం మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి బంజారాహిల్స్ డివిజ‌న్ లోని బోలానగర్‌లో పాద‌యాత్ర నిర్వ‌హించారు. టీఆర్ఎస్ కార్పోరేట‌ర్ అభ్య‌ర్థి గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో క‌లిసి ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యాక్ర‌మ‌ల‌ను వివ‌రిస్తూ టీఆర్ఎస్ కే ఓటు వేయాల‌ని అభ్య‌ర్థించారు.అనంతరం దోభి ఘాట్‌లో ఏర్పాటు చేసిన ఖాజానగర్, బొలానగర్ బూత్ కమిటీ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమ్మద్ అలీ, రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. కులం, మతాలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కానీ కొంత మంది మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకపోగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరద బాధిత కుటుంబాలకు పది వేలు ఇస్తుంటే.. ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -