శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి:ఇంద్రకరణ్

282
ik reddy
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మహాశివరాత్రి ఉత్సవాలను మూడు రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహిస్తామని తెలిపారు. రాజన్నను దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ సారి వేడుకలకు నాలుగు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి తరలివస్తారని చెప్పారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో భక్తులంతా తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని.. విధిగా మాస్క్‌ ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలన్నారు.

అంతకముందు ఆలయానికి చేరుకున్న ఇంద్రకరణ్ రెడ్డికి అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శనానంతరం.. అర్చకులు వేద ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు.

- Advertisement -