తెలంగాణ ప్రజల కొంగు బంగారం..కొండగట్టు అంజన్న

180
kavitha
- Advertisement -

కొండగట్టు అంజన్న తెలంగాణ ప్రజల కొంగు బంగారం అన్నారు ఎమ్మెల్సీ కవిత.జగిత్యాల కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో రామకోటి స్థూపం నిర్మాణానికి దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత మంగళవారం భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కవిత…కొండగట్టు అంజనేయ సేవా సమితి ఏర్పాటు చేస్తాం..ఇంటింట్లో హనుమాన్ చాలీసా జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం అని తెలిపారు. ఈ నెల 17 నుండి అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుందన్నారు.

అంతకు ముందు ఆలయానికి చేరుకున్న మంత్రి ఐకేరెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, సంజయ్‌కుమార్‌కు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

- Advertisement -