సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రం..

29
- Advertisement -

రోజురోజుకు ధరలను పెంచుతూ కేంద్రం సామాన్యుడి నడ్డి విరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీశ్ రావు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ ధర పెంచడాన్ని నిరసిస్తూ ఘట్‌కేసర్‌లో బీఆర్‌ఎస్‌ పెద్దఎత్తున ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌.. బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అన్నారు.అడ్డగోలుగా గ్యాస్‌ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంక్షేమ పథకాలపై కోతలు పెట్టి బీజేపీ ప్రభ్తువం పేదల నడ్డి విరుస్తున్నదని చెప్పారు. ఎన్నికల తర్వాత గ్యాస్‌ ధరలు పెంచడం ఆనవాయితీగా మారిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు రాగానే గ్యాస్‌పై 10 పైసలు తగ్గిస్తారని, అవి పూర్తవగానే రూ.100 పెంచుతారని దుయ్యబట్టారు.

గతంలో గ్యాస్‌ ధర రూ.400 ఉంటేనే బీజేపీ గగ్గోలు పెట్టిందని…మరి ఇప్పుడు రూ.1100 దాటిందని, ఆ పార్టీ నాయకులు ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు. ఉపాధిహామీ పథకంలో రూ.30 వేల కోట్లు కోత పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -